Sunday 2 December 2012

సుగుణ సుందరీ

ఆకతాయి గుంట  అల్లరి మానీ ... అణకువతో నిలిచి ఉన్న నన్ను చూడవా ? అసలేంటో  నీకు అంత  టెక్కు.... గూబ  గుయ్యమనిన్చేయ్ లా  ... ఏసాలు...  ఎకస్త్రాలు ఆపవోయ్.... బుంగ మూతి నువ్వూ ! వదలని కదలని నీ  చూపులతో ఇబ్బంది. పెగలని పలకని నీ  నోటి తో కస్టం . నీకు ఇది పాడి  అగునా ? మిల మిల చూపులు ..... మొహమాటం లేని మాటలు కరువు ఎందుకయ్యాయో ? ఇష్టం లేదని కష్తం కలగకుండా  చేప్తవేమోనని భయం .స్పందన కరువాయే! చీకటి చెరలను  విరిచే సూర్యుడు వచ్చేలోపు మన సంగతి తెల్చేయే రాదు. ప్లీజు ...బోడి మొహమా ! ఓ నా    సుగుణ సుందరి మన ఇద్దరి మధ్య ఈ వెన్నెల విలవిలలాడి పోతుంది.గాలి కూడా ఆలోచనలో పడింది   వీళ్ళకి రోజు ఇదేం రోగమని. చుక్కల ముగ్గులా  అలా  అలా  మెలికలు తిరగడం కాసేపు ఆపవా  ప్లీజు .... కొండపల్లి కొయ్యి బొమ్మలా తల ఊపడం ఆపి కుదురుగా కబురులు చెప్పరాదటే !

Wednesday 21 November 2012

కసబ్(Kasab) కనుమరుగైనపుడు ...

నా పిచ్చి అమాయకపు స్నేహితుల్లారా( ఎవరైతే కసబ్  చనిపోయాడని ఆనందం వ్యక్తం చేస్తూ FB లో post చేసారో) ... కసబ్  చనిపోయాడని మీరు సంబరాలు FB లో చేసుకుంటున్నారు గాని ... అసలు కసాబ్ని ఇంత  sudden గా  ఉరి  ఎందుకు తీసారు అని ఎంతమంది ఆలోచించారు. డెంగ్యు  fever తో చనిపోయడే అనుకోండి ఆ credit కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది అంటారా ? మరి ఇప్పుడిప్పుడే  అవిశ్వాస తీర్మానం పెడదామనుకున్న BJP ని కాస్త ఉరట కలిగించాలని its a tricky game. మరి చివరాఖరిగా నేనేం చెప్తున్నానంటే यदा यदाहि धर्मश्य : ग्लानी र्भावती भारतः .... అని శ్రీ కృష్ణుడు కసబ్  రూపంలో పుట్టాడు. పుట్టినవాడు మరణించక  తప్పదు అని కొందరు భావించాల .... రాజు శవం తో పాటు  ఎవరిదైన శవం తోడూ వెళ్ళాలి కాబట్టి మన రాజు థాకరే తో పాటు  కసబ్ని కూడా పంపించారు. తద్వారా బాహ్య ప్రపంచానికి భారత్ అంటే 'భిన్నత్వంలో ఎకత్వమని' లేదా 'హిందూ ముస్లిం భాయి  భాయి  అని prove చేయబడిందని కొందరు భావించి రెండు రోజులు rest తీసుకుంటే మళ్లీ  పాత  బస్తీ  లో ఏ  అల్లరి మూక  గొడవ పెడుతుంది అంతవరకూ ఇది గుర్తుంచికో0డి. No Doubt ఈ  three days లో ఏదో  ఒక sensational news మీ ముందుంటుంది. దీనికి నాది  హామీ. further గా  ఏమైనా డౌట్స్ ఉంటే  నాకు ఫోన్ చెయ్యొద్దు ఎందుకంటే నా ఫోన్ ఈ మధ్య కొన్ని software కారణాల వల్ల  సర్రిగ్గా పని చెయ్యడం లేదు.

Thursday 13 September 2012

జనార్ధన మహర్షి

"గేలం వేస్తే చేపలు పడతాయి. గాలెం వేస్తె గుంటలు పడతారు" అంటూ చెప్పాడు చుక్కల్లేని చందమామని చూస్తూ మా ఊరి కవి జనార్ధన మహర్షి. అసలే చుక్క ఎక్కు వై చక్కెర్లు కొడుతున్న వెంకేటేష్కి కవి గారు అలా ఎందుకన్నారో అర్థం కాలేదు.

మా వురి scientist

" సల సల మరిగే నూనెలో సన్నని నీటి ధార బుగ బుగ మనే పొగలు పుట్టిస్తుంది " అనే scientific invention కనుక్కొన్నాడు మా ఊరి సామ్రాజ్యపు శ్రీకాంత్. అసలు శ్రీకాంత్ మా వురి scientist ఇలాంటి పోరంబోకు కబుర్లు చెప్పమంటే వాడికన్నా ముందు ఇంకెవ్వరు ఉండకూడదనే ఫీలింగ్ వాడిది. నిజం చెప్పాలంటే శ్రీకాంత్ ఇలాంటి కబుర్లు ఎన్ని చెప్పినా వాడు అంటే అదో గౌరవం , భయం, భక్తీ.

సరీస్రుపాలు

" వెన్నెముక లేని జంతువులును సరీస్రుపాలు అంటఆరు" అని పాఠం మొదలెట్టారు సైన్స్ మాష్టారు గోవింద్. "వెర్టిబ్రెట్సా?" " నాన్ వెర్టిబ్రెట్సా" అని ఆలోచిస్తున్నాడు రామ్మూర్తి కొడుకు గోవింద్. వాడీమద్ద్యే ఇంగ్లీష్ మీడీయం నుండీ మార్కులు సరిగ్గా రాక తెలుగు మీడీయం లో జాయిన్ చేసాడు వాడి అయ్య రామ్ముర్తి. వీల్లద్దరి పేర్లు ఒకటే అయినా డిజిగ్నెషన్ వేరు. కాకపోతే ఒక సిమిలారిటి ఉంది. ఇప్పుడు మన గోవింద్ ఎక్కడ కూర్చోన్న
ాడో సరిగ్గా 40 సం!! క్రితం సైన్స్ మాష్టార్ గోవింద్ సర్ కూడా అక్కడే కూర్చోన్నాడు. ఇక్కడే ఇంకోక ట్విస్ట్ ఉందండోయ్. మన హీరో గోవింద్ నాన్న రామ్మూర్తి , మన సైన్సె మాష్టార్ గోవింద్ బ్యాచ్ మేట్స్.

ఈ గోవింద్ ల గోల ఏంటీ అని ఎవరైన తల గోక్కుంటే ప్రక్క వాళ్ళ తో చెప్పించండి. మా గోవింద్ మాష్టర్ని పంపిస్తాను. ఏం జరుగుతుందో చెప్పడానికి .....
సరేనా

శాస్త్రి 'ఆలోచన'

షుమారు ఆరున్నర కి.మీ. దూరం తన TVS మోటారు సైకిల్ మీద ప్రయాణం చేసాక సడన్ గా break వేసి తన బండిని ఆపాడు మా పక్క ఊరు పంతులు రామచంద్ర శాస్త్రి " అసలీ బాపనోడు బండి ఎందుకాపాడబ్బా" అని ఆలోచిస్తున్నాడు వెనకనే కూర్చొన్న తన un official asst సూర్యనారాయణ.
బండి దిగుతూ stand వేస్తున్న శాస్త్రి గారు " అరే అబ్బి వెధవ మస్థిష్కంలో ఒక ఆలోచన వచ్చింది. దానికి నీ సహాయం కావలబ్బాయి"
" ఈదమ్మా! ఈ పిచ్చి నా ము ------- కు (బూ

తు) ఈ టైం లో ఏం ఆలోచన వచ్చిందబ్బా?" అంటూ శాస్త్రి గారు ఏం ఆలోచించి ఉంటారనీ సూర్యనారాయణ ఆలోచిస్తున్నాడు
ఇంతకీ పెళ్లి తంతు ముగించి వస్తున్నా శాస్త్రి గార్కి మధ్య రాత్రి 12:45 వచ్చిన ఆలోచన ఏమయ్యింటుంది? పెళ్లి లో ఏమయినా జరిగిందా? వెధవ మస్థిష్కం అన్నాడు అంటే ఏదయినా చెడు ఆలోచన కలిగిందా? ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతున్న మా సూర్యనారాయణకి ఈ సమయంలో ఎవరు సాయం చేస్తారు?

Sunday 22 July 2012

తలబిరుసు ఎంకటప్పు రావు

తలబిరుసుకు పెద్ద ఉదాహరణ మా ఊర్లో ఎంకటప్పు రావు. వాడికి ఇద్దరు పెళ్ళాలు.  అందులో పెద్ద దానికి కొంచెం తక్కువ తలబిరుసు ఉంటే దానికి షుమారు ఏడింతలు చిన్న దానికి ఎక్కువే .. తలబిరుసు. అంత తలబిరుసు ఉన్నవాడికి ఇద్దరు పెళ్ళాలు ఎలా set అయ్యారు అని ఎవరికైనా doubt వస్తే (మీకు రాలేదు కదండీ) " బాగా పొగ 'రు' ( పొగ తాగే వారు, A person who drinks smoke),కొంచెం తలబిరుసు కూసంత గోరోజనం ఉంటే అమ్మయులికీ ఇష్ట మాటయో" అని టక్కున చెప్తాడు రామారావు. (వీడు వాడికి ఎక్ష్పర్టి లెండి). " ఏరా నిజమట్ర?" అని మీరు తిరిగి అడిగారు అనుకోండి. మొన్న ఎంకటప్పు రావు చెప్పాడయెహ్  అని మారుమాటలాడానివ్వకుండ మీ నోరు మూయిం చేస్తాడు మనోడు.
ఇంతకీ ఎంకటప్పు రావు, రామ రావు గోల మీకెందుకు అనుకుంటున్నార ? ' ముందున్నది మొసళ్ళ పండగ !' (ఈ సామెత ఎలా పుట్టిందో మీకు తెలుసా ?)