Sunday 22 July 2012

తలబిరుసు ఎంకటప్పు రావు

తలబిరుసుకు పెద్ద ఉదాహరణ మా ఊర్లో ఎంకటప్పు రావు. వాడికి ఇద్దరు పెళ్ళాలు.  అందులో పెద్ద దానికి కొంచెం తక్కువ తలబిరుసు ఉంటే దానికి షుమారు ఏడింతలు చిన్న దానికి ఎక్కువే .. తలబిరుసు. అంత తలబిరుసు ఉన్నవాడికి ఇద్దరు పెళ్ళాలు ఎలా set అయ్యారు అని ఎవరికైనా doubt వస్తే (మీకు రాలేదు కదండీ) " బాగా పొగ 'రు' ( పొగ తాగే వారు, A person who drinks smoke),కొంచెం తలబిరుసు కూసంత గోరోజనం ఉంటే అమ్మయులికీ ఇష్ట మాటయో" అని టక్కున చెప్తాడు రామారావు. (వీడు వాడికి ఎక్ష్పర్టి లెండి). " ఏరా నిజమట్ర?" అని మీరు తిరిగి అడిగారు అనుకోండి. మొన్న ఎంకటప్పు రావు చెప్పాడయెహ్  అని మారుమాటలాడానివ్వకుండ మీ నోరు మూయిం చేస్తాడు మనోడు.
ఇంతకీ ఎంకటప్పు రావు, రామ రావు గోల మీకెందుకు అనుకుంటున్నార ? ' ముందున్నది మొసళ్ళ పండగ !' (ఈ సామెత ఎలా పుట్టిందో మీకు తెలుసా ?)