Wednesday 19 July 2017

నెత్తురు ధార

సమయం ఉదయం 6 గంటలు. 
  పెట్రోల్ పంపు    ప క్కనుండి పోతున్న ఒక ఐస్ బండి వాడు అకస్మాత్తుగా బండిని ఆపాడు
****          *****              ****        ****         ****
సమయం 7 గంటలు.
బండి నుండి కారుతున్న ఐస్ కరిగి మెల్లగా అక్కడే పడివున్న శవాన్ని తాకింది.
****             *****            *****            ****        ****
సమయం 7.30.
పోలీసులు వచ్చి శవాన్ని తీసుకు వెళ్శారు. కరిగిన ఐస్ రక్తంలో కరిగిపోయింది. సర్రుమంటూ BMW దూసుకు వెళ్లింది. కారు లైట్ల కాంతి ఐస్ లో కలిసిపోయిన  రక్తం మీద పడింది. ు మంటల్లో కరుగుచున్న ఇనుప కడ్డీలా కనిపిస్తుంది ఆ ఐస్ బండి పిల్లాడీకి. కల్లలో నీరును ఆపుకోని, "అమ్మ చనిపోయింది మామయ్" అంటూ దూరంగా పడి ఉన్న నల్ల సంచిని పక్కనే పడివున్న మామయ్య చెెప్పులను చూపించాడు. నల్ల సంచికి దగ్గరగా వెలుతున్న వాళ్ల అమ్మకు సగం తిని వదిలేసిన బొక్కలు కనిపించాయి. మరి కొంచెం దూరంలో చెదురు ముదురుగా మాసపు ముక్కలు... భరించలేని మాసపు వాసన
******              *****           ******           *****             *****
సమయం 9 గంటలు.
నిన్న రాతిరి మాసము తెస్తానని పోయిన తమ్ముడు తాగి పడిపోయేడేమోనని అనుకుంది.
****         ****        ******              *****          
సమయం 10 గంటలు.
బండిలో ఐస్ మొత్తం కరిగి పోయింది. "ఒరేయ్ .. లం*** కొడుకా. బండి పక్కకి తియ్యు" . అంతే అమ్మని ఓదారుస్తూ ఆ ఆరేల్ల పిల్లోడు బండిని ముందుకు తోసుకు పోయాడు.
గుమి కూడిన జనం రెండు నిమిషాల్లో రెక్కలొచ్చిన కొత్త పక్షిలా ఎగరలేక ఎగురుతూ దూరంగా పారిపోయారు.
ఏంటో ఈ జనం.

(మంటో  కధల ఆధారంగ రాయబడినది)

16/07/2017 Murali Basa