Thursday 13 September 2012

జనార్ధన మహర్షి

"గేలం వేస్తే చేపలు పడతాయి. గాలెం వేస్తె గుంటలు పడతారు" అంటూ చెప్పాడు చుక్కల్లేని చందమామని చూస్తూ మా ఊరి కవి జనార్ధన మహర్షి. అసలే చుక్క ఎక్కు వై చక్కెర్లు కొడుతున్న వెంకేటేష్కి కవి గారు అలా ఎందుకన్నారో అర్థం కాలేదు.

మా వురి scientist

" సల సల మరిగే నూనెలో సన్నని నీటి ధార బుగ బుగ మనే పొగలు పుట్టిస్తుంది " అనే scientific invention కనుక్కొన్నాడు మా ఊరి సామ్రాజ్యపు శ్రీకాంత్. అసలు శ్రీకాంత్ మా వురి scientist ఇలాంటి పోరంబోకు కబుర్లు చెప్పమంటే వాడికన్నా ముందు ఇంకెవ్వరు ఉండకూడదనే ఫీలింగ్ వాడిది. నిజం చెప్పాలంటే శ్రీకాంత్ ఇలాంటి కబుర్లు ఎన్ని చెప్పినా వాడు అంటే అదో గౌరవం , భయం, భక్తీ.

సరీస్రుపాలు

" వెన్నెముక లేని జంతువులును సరీస్రుపాలు అంటఆరు" అని పాఠం మొదలెట్టారు సైన్స్ మాష్టారు గోవింద్. "వెర్టిబ్రెట్సా?" " నాన్ వెర్టిబ్రెట్సా" అని ఆలోచిస్తున్నాడు రామ్మూర్తి కొడుకు గోవింద్. వాడీమద్ద్యే ఇంగ్లీష్ మీడీయం నుండీ మార్కులు సరిగ్గా రాక తెలుగు మీడీయం లో జాయిన్ చేసాడు వాడి అయ్య రామ్ముర్తి. వీల్లద్దరి పేర్లు ఒకటే అయినా డిజిగ్నెషన్ వేరు. కాకపోతే ఒక సిమిలారిటి ఉంది. ఇప్పుడు మన గోవింద్ ఎక్కడ కూర్చోన్న
ాడో సరిగ్గా 40 సం!! క్రితం సైన్స్ మాష్టార్ గోవింద్ సర్ కూడా అక్కడే కూర్చోన్నాడు. ఇక్కడే ఇంకోక ట్విస్ట్ ఉందండోయ్. మన హీరో గోవింద్ నాన్న రామ్మూర్తి , మన సైన్సె మాష్టార్ గోవింద్ బ్యాచ్ మేట్స్.

ఈ గోవింద్ ల గోల ఏంటీ అని ఎవరైన తల గోక్కుంటే ప్రక్క వాళ్ళ తో చెప్పించండి. మా గోవింద్ మాష్టర్ని పంపిస్తాను. ఏం జరుగుతుందో చెప్పడానికి .....
సరేనా

శాస్త్రి 'ఆలోచన'

షుమారు ఆరున్నర కి.మీ. దూరం తన TVS మోటారు సైకిల్ మీద ప్రయాణం చేసాక సడన్ గా break వేసి తన బండిని ఆపాడు మా పక్క ఊరు పంతులు రామచంద్ర శాస్త్రి " అసలీ బాపనోడు బండి ఎందుకాపాడబ్బా" అని ఆలోచిస్తున్నాడు వెనకనే కూర్చొన్న తన un official asst సూర్యనారాయణ.
బండి దిగుతూ stand వేస్తున్న శాస్త్రి గారు " అరే అబ్బి వెధవ మస్థిష్కంలో ఒక ఆలోచన వచ్చింది. దానికి నీ సహాయం కావలబ్బాయి"
" ఈదమ్మా! ఈ పిచ్చి నా ము ------- కు (బూ

తు) ఈ టైం లో ఏం ఆలోచన వచ్చిందబ్బా?" అంటూ శాస్త్రి గారు ఏం ఆలోచించి ఉంటారనీ సూర్యనారాయణ ఆలోచిస్తున్నాడు
ఇంతకీ పెళ్లి తంతు ముగించి వస్తున్నా శాస్త్రి గార్కి మధ్య రాత్రి 12:45 వచ్చిన ఆలోచన ఏమయ్యింటుంది? పెళ్లి లో ఏమయినా జరిగిందా? వెధవ మస్థిష్కం అన్నాడు అంటే ఏదయినా చెడు ఆలోచన కలిగిందా? ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతున్న మా సూర్యనారాయణకి ఈ సమయంలో ఎవరు సాయం చేస్తారు?