Thursday 13 September 2012

శాస్త్రి 'ఆలోచన'

షుమారు ఆరున్నర కి.మీ. దూరం తన TVS మోటారు సైకిల్ మీద ప్రయాణం చేసాక సడన్ గా break వేసి తన బండిని ఆపాడు మా పక్క ఊరు పంతులు రామచంద్ర శాస్త్రి " అసలీ బాపనోడు బండి ఎందుకాపాడబ్బా" అని ఆలోచిస్తున్నాడు వెనకనే కూర్చొన్న తన un official asst సూర్యనారాయణ.
బండి దిగుతూ stand వేస్తున్న శాస్త్రి గారు " అరే అబ్బి వెధవ మస్థిష్కంలో ఒక ఆలోచన వచ్చింది. దానికి నీ సహాయం కావలబ్బాయి"
" ఈదమ్మా! ఈ పిచ్చి నా ము ------- కు (బూ

తు) ఈ టైం లో ఏం ఆలోచన వచ్చిందబ్బా?" అంటూ శాస్త్రి గారు ఏం ఆలోచించి ఉంటారనీ సూర్యనారాయణ ఆలోచిస్తున్నాడు
ఇంతకీ పెళ్లి తంతు ముగించి వస్తున్నా శాస్త్రి గార్కి మధ్య రాత్రి 12:45 వచ్చిన ఆలోచన ఏమయ్యింటుంది? పెళ్లి లో ఏమయినా జరిగిందా? వెధవ మస్థిష్కం అన్నాడు అంటే ఏదయినా చెడు ఆలోచన కలిగిందా? ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతున్న మా సూర్యనారాయణకి ఈ సమయంలో ఎవరు సాయం చేస్తారు?

No comments:

Post a Comment