Sunday 2 December 2012

సుగుణ సుందరీ

ఆకతాయి గుంట  అల్లరి మానీ ... అణకువతో నిలిచి ఉన్న నన్ను చూడవా ? అసలేంటో  నీకు అంత  టెక్కు.... గూబ  గుయ్యమనిన్చేయ్ లా  ... ఏసాలు...  ఎకస్త్రాలు ఆపవోయ్.... బుంగ మూతి నువ్వూ ! వదలని కదలని నీ  చూపులతో ఇబ్బంది. పెగలని పలకని నీ  నోటి తో కస్టం . నీకు ఇది పాడి  అగునా ? మిల మిల చూపులు ..... మొహమాటం లేని మాటలు కరువు ఎందుకయ్యాయో ? ఇష్టం లేదని కష్తం కలగకుండా  చేప్తవేమోనని భయం .స్పందన కరువాయే! చీకటి చెరలను  విరిచే సూర్యుడు వచ్చేలోపు మన సంగతి తెల్చేయే రాదు. ప్లీజు ...బోడి మొహమా ! ఓ నా    సుగుణ సుందరి మన ఇద్దరి మధ్య ఈ వెన్నెల విలవిలలాడి పోతుంది.గాలి కూడా ఆలోచనలో పడింది   వీళ్ళకి రోజు ఇదేం రోగమని. చుక్కల ముగ్గులా  అలా  అలా  మెలికలు తిరగడం కాసేపు ఆపవా  ప్లీజు .... కొండపల్లి కొయ్యి బొమ్మలా తల ఊపడం ఆపి కుదురుగా కబురులు చెప్పరాదటే !

1 comment: